ఇప్పటి వరకు సర్కార్ సీజన్ 3 కి ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చి గేమ్స్ ఆడారు. కానీ ఫస్ట్ టైం ఈ సీజన్ కి ఈ వారం షోకి నలుగురు స్పోర్ట్స్ పర్సొనాలిటీస్ వచ్చారు. బాడ్మింటన్ నుంచి సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, ఇండియన్ క్రికెట్ టీమ్ నుంచి స్నేహ దీప్తి, రావి కల్పనా వచ్చారు. "మిమ్మల్ని ఇలా ఒక షోలో చూడడం చాలా హ్యాపీగా ఉంది..మీరు రెగ్యులర్ గా ఏ షోకి కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు అనుకుంటా" అని ప్రదీప్ అనేసరికి " " ఇదే నా ఫస్ట్ షో..నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం..ఈ షోని ఇంతకు ముందే చూసాను" అని చెప్పారు సైనా నెహ్వాల్.
తర్వాత స్టేజి మీదకు వచ్చిన కశ్యప్ గారితో "మిమ్మల్ని ఇలా కలవడం చాలా హ్యాపీ గా ఉంది..ఈ అద్భుతం అసలు ఎలా జరిగింది." అని ప్రదీప్ అడిగేసరికి "నాకూ తెలీదు జరిగిపోయింది అంతే" అన్నారు. "నేను అడుగుతోంది బాడ్మింటన్ గురించి" అని ప్రదీప్ అనేసరికి "నేను కూడా దాని గురించే చెప్తున్నా" అన్నారు కశ్యప్.."చేతులతో బాడ్మింటన్ ఆడుతూ కళ్ళు ఎందుకు ఖాళీగా ఉంచాలి అని ఆమె వైపు తిప్పారు కదా " అని ప్రదీప్ కామెడీ చేసాడు. "అసలు మీ ఇద్దరి జర్నీ ఎక్కడ, ఎలా స్టార్ట్ అయ్యింది" అని అడగడంతో " నేను సైనా కంటే మూడేళ్లు సీనియర్ ని. మధ్యలో నేను బెంగుళూరు వెళ్ళిపోయాను.. తిరిగి వచ్చేసరికి ఇద్దరికీ సేమ్ గ్రూప్ లో ట్రైనింగ్ ఇచ్చారు.
ఇద్దరం సేమ్ టైంలో జూనియర్ ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాము. కోచ్ ఇద్దరికీ ఒక్కరే...ట్రైనింగ్ మెథడ్స్ కూడా ఒక్కటే..అలా కలిసి కలిసి చివరికి ఆప్షన్ లేక పెళ్లి చేసుకున్నాం" అని చెప్పారు.."చూసారా బాడ్మింటన్ పేరిచ్చింది, లైఫ్ ఇచ్చింది, వైఫ్ ఇచ్చింది" అన్నాడు ప్రదీప్. ఇదంతా ఐపోయాక బిడ్డింగ్ వేసి ఫస్ట్ క్వశ్చన్ కి " 20 నుంచి 2000 వరకు ఉన్న కరెన్సీ నోట్స్ అన్నీ కూడా కూడితే వచ్చే మొత్తం ఎంత" అనేసరికి "2870 " అని కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసారు. "ఇంత కరెక్ట్ గా ఎలా ఆన్సర్ చెప్పారు చిన్నప్పటి నుంచి క్లాస్ లో లేరు ఫీల్డ్ లోనే ఉన్నారు ఆడుతున్నారు..లెక్కలు ఇంత బాగా ఎలా వచ్చాయి..ఇంత షార్ప్ గా ఎలా ఉన్నారు" అని అడిగాడు "డబ్బా కొట్టాలంటే బాగా చెప్పొచ్చు ఇప్పుడు..కానీ వద్దు...నాకు లెక్కలంటే చాలా ఇష్టం" అని చెప్పారు కశ్యప్...ఈ వారం షోలో అందరూ బాగా ఆడారు కానీ ఎవరూ కోటి రూపాయలు గెలుచుకోలేకపోయారు.